||కఠోపనిషత్ ||

|| అథాతో బ్రహ్మజిజ్ఞాస లో |

|| Om tat sat ||

కఠోపనిషత్ -

ఇది కఠోపనిషత్తు గురించి.

కఠ అనే ఋషి చే ఈ ఉపనిషత్తు అందింపబడడము వలన ఈ ఉపనిషత్తును కఠోపనిషత్తు అని అంటారు. ఇది యజుర్వేదములోనిది. అందులోనూ కృష్ణ యజుర్వేదము లోనిది. కృష్ణ యజుర్వేదములో తైత్తరీయ అరణ్యకములో కథోపనిషత్తు ఒక భాగము.

ఒక సారి "అథాతో బ్రహ్మజిజ్ఞాస" అని బ్రహ్మ సూత్రములలో మొదటి సూత్రము శీర్షికగా మొదలెట్టిన తరువాత ఈ శీర్షిక ధ్యాస ఉపనిషత్తులమీద లేక వేదాంతము మీద శంకరాచార్యుల వారిచే రాయబడిన సోపాన గ్రంథాలమీద ఉంచాలా అని అలోచనలో పడ్డాము. అలా అలోచిస్తున్నప్పుడు కథోపనిషత్తు మీద నృత్య సంగీత ప్రదర్శనము చూశాము. అది చాలాబాగుంది . దానికి కారణము కథోపనిషత్తులో ఉన్న చాలా మంచి మంచి వాక్యాలు. ఆ నృత్య సంగీత ప్రదర్శనము చూసిన వెంటనే మా ఆలోచనకి సమాధానము దొరికింది.

అందుకని వెంటనే కథోపనిషత్తుని ఇంగ్లీషు-సంస్కృతములో ఆరు భాగాలలో కాసరబాద అర్గు లో తీసుకురావడము అయినది. అది తీసుకువచ్చిన తరువాత అదే మళ్ళీ మళ్ళీ చదివితే , కథోపనిషత్తు ఇంకా సులభముగా ఉండేటట్టు రాయాలనిపించింది. అప్పుడు మళ్ళీ " సులభముగా కథోపనిషత్తు " అనే శీర్షికలో ఇంగ్లీషులోనే రెండవసారి ఆరు భాగలాలో తీసుకు రావడము అయినది . అప్పుడు కాసరబాద అర్గ్ లో తెలుగు పేజీలు ఎక్కువ ఉండేవి కావు. ఈ మధ్య భగవద్గీత రాసే కార్యక్రమములో కాసరబాద అర్గ్ లో తెలుగు పేజీలు ముందుకు వచ్చాయి. ఈ సందర్భములో ఒకమిత్రులు కథోపనిషత్తు తెలుగులో రాశారా అని ప్రశ్నవేయడము జరిగింది. దానికి సమాధానముగా భగవద్గీత అయిన తరువాత జనవరినుంచి తెలుగులో రాస్తాము అని చెప్పడము అయింది కూడా.

అందుకని ఇప్పుడు మళ్ళీ "సులభముగా కథోపనిషత్తు " ని తెలుగులో తీసుకు వస్తున్నాము.

కథోపనిషత్తు చాలా అందమైన గ్రంథము. దీనిలో ని శ్లోకాలు కొన్ని ఉన్నవి ఉన్నట్లు గా భగవద్గీతలో వచ్చాయి. అంటే భవద్గీత రాయబడినప్పుడు కూడా కథోపనిషత్తు కి చాలా ప్రాముఖ్యత ఉండేది అన్నమాట. దీనిలో ముఖ్యపాత్ర నచికేతుడు అనే బాలుడు. ఆ బాలుడు యమధర్మరాజు దగ్గరకు పోయి మరణము గురించిన సత్యాలను అడుగుతాడు. ఆప్రశ్నలకు సమాధానమే కఠోపనిషత్తు. ముఖ్యపాత్ర నచికేతుడు అనే బాలుడు అన్నాము. అది ఆ బాలుని ధైర్యము విశ్వాసము వివేకము త్యాగము వలన. అయితే మనకు తెలిసే వేదాంతము అంతా యమధర్మరాజు సమాధానము ద్వారానే. అంటే నిజానికి ముఖ్యపాత్ర యమధర్మరాజు ది అన్నమాట.

సంస్కృత గ్రంధాలు సంస్కృతము తో చదివితేనే వాటి అందము కనిపిస్తుంది అని మాభావన. అందుకని ఈ కథోపనిషత్తు మీద రాయడములో లో సంస్కృతము తెలుగు కలిపి రాయడము అయినది.

దీనిలో శ్లోకాలు, వచనవ్యాఖ్యానము విడివిడిగా తీసుకు రావడము అయినది

ఇది మీ ఆనందము కోసమే .

|| ఓమ్ తత్ సత్ ||